గాంధారి మైసమ్మ బోనాల జాతరను విజయవంతం చేయండి

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ పిలుపు

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట రహదారి పక్కన ఉన్న గాంధారి మైసమ్మ ఆలయంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల జాతరను ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జాతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.

భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు తదితర ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రతి ఏడాది జాతర నిర్వహణకు క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసు శాఖ, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా అదే విధంగా సహకరించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు జక్కుల సమ్మయ్య, టి.ఎం. సత్యనారాయణ, పోరెడ్డి మొండి, ఎం. కనకయ్య, కందునూరి రాజయ్య, వేనంక కుమార్, మొగిలి ఓదెలు, పారుపల్లి తిరుపతి, భీమా శరత్, పల్లె ఓదెలు, మొగిలి గట్టయ్యతో పాటు ఆలయ పూజారులు పాల్గొన్నారు.