​బాసర ట్రిపుల్ ఐటీకి దండేపల్లి విద్యార్థి జశ్విత్ ఎంపిక..

దండేపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆర్. జశ్విత్ ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యాడు. పదో తరగతి ఫలితాల్లో మండల ప్రథమ స్థానాన్ని సాధించిన జశ్విత్, తన ప్రతిభతో ఈ సీటును దక్కించుకున్నట్లు పాఠశాలప్రధానోపాధ్యాయులు సంఘర్స్ రాజేశ్వర్ రావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,​ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ, కష్టపడి ట్రిపుల్ ఐటీ సీటు సాధించి పాఠశాలకే కాకుండా యావత్ మండలానికే జశ్విత్ గర్వకారణంగా నిలిచాడని హెచ్‌ఎం హర్షం వ్యక్తం చేశారు.​బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన జశ్విత్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్ రావుతో పాటు ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు, గ్రామస్థులు ఘనంగా అభినందించారు. భవిష్యత్తులో జశ్విత్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

Leave a Reply