కనకదుర్గమ్మకు లక్ష్మీ కాసుల హారం కానుక..
- సుమారు 17 లక్షల విలువైన ఆభరణాల విరాళం..
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడ లబ్బీపేటకు చెందిన దొండేటి ఐశ్వర్య జ్యోతి, కుటుంబ సభ్యులు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి రూ.17 లక్షల విలువైన 108 గ్రాముల బరువున్న బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని భక్తిశ్రద్ధలతో విరాళంగా సమర్పించారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిపై ఉన్న భక్తిని చాటుతూ 108 గ్రాముల బరువున్న బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా అందజేశారు. సుమారు రూ.17 లక్షల విలువైన ఈ ఆభరణాన్ని ఇంద్రకీలాద్రిపైని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ను కలిసి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు, రసీదును దాతకు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానాలయ సూపర్డెంట్ నాగేశ్వరరావు ఇతరులు ఉన్నారు.
