Delhi High Court | వేధింపుల కేసులో నిర్దోషి…
మహిళా రెజ్లర్ల ఫిర్యాదులపై నమోదైన కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బీజేపీ నేత, మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలువురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం బ్రిజ్ భూషణ్‌పై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. దీంతో ఈ కేసులో ఆయనకు న్యాయపరంగా ఊరట లభించింది.
