డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించండి

అమరావతి, ఆంధ్రప్రభ: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డీఎస్సీ, పోలీసు ఉద్యోగ అభ్యర్థుల జేఏసీ డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని జేఏసీ కన్వీవర్‌ ఎంబేటి రామచంద్ర హెచ్చరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆదివారం జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు.

ప్రతీ నిరుద్యోగికీ రూ. 3 వేల భృతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా దాన్ని అమలుచేయలేదన్నారు. అలాగే 10 వేల ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు.