AP | సినిమా టికెట్ల ధరల ఖరారుపై కమిటీ ఏర్పాటు

అమరావతి : ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల ఖరారుపై ఓ కమిటీ ఏర్పాటు చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సమాచార శాఖ కార్యదర్శి, ఆర్ధిక శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, సినీ నిర్మాత వివేక్ కుచిభట్ల సభ్యులుగా ఉంటారు. సినిమా టికెట్ ధరలు పెంచాలనిగతంలో హైకోర్టులో పిటీషన్ దాఖలైన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులజారీ చేశారు.

Leave a Reply