చిలుకూరి మరణం పార్టీకి తీరని లోటు : మాజీ ఎమ్మెల్యే బొల్లా

శావల్యాపురం, ఆంధ్రప్రభ : చిలుకూరి లక్ష్మీనారాయణ మరణం పార్టీకి తీరని లోటని వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, వైసీపీ పిఎసి మెంబర్ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. మండలంలోని గంటవారిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చిలుకూరి లక్ష్మీనారాయణ మరణించగా వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లా ఆదివారం పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ పార్టీలో ఉత్సాహంగా తిరిగే వ్యక్తి మరణించడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆయన తో పాటు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.