Disability Welfare | దివ్యాంగులసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
Disability Welfare | దివ్యాంగులసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
Disability Welfare | దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుంది.
నారా లోకేష్ యువగళం హామీ తోనే దివ్యాంగులకు, వయో వృద్ధులకు సహాయ పరికరాలు.
4 కోట్ల రూపాయలతో మూడు వేల మంది దివ్యాంగులకు పరికరాలు పంపిణీ..
నంద్యాల ఎం. పి. కలెక్టర్..
Disability Welfare | నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ : దివ్యాంగులను అక్కున చేర్చుకొని ఆధరించింది దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని ఆయన ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సూచనల మేరకు నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో యువ గళం పాదయాత్ర లో విద్యాశాఖ మంత్రి నార లోకేష్ ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకు నాలుగు వేల కోట్ల రూపాయలతో మూడు వేల మందికి ఆధునిక దివ్యాంగ పరికరాలను వేలాది మంది దివ్యాంగులు, వయో వృద్ధులకు అన్నంపెట్టి సహాయ పరికరాలు అందించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు .
సోమవారం మార్కెట్ యార్డులో వేలాది మంది దివ్యాంగులు, వయో వృద్ధుల హర్ష ధ్వనుల మధ్య ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారిల చేతుల మీదుగా ఒకేసారి 4 కోట్ల రూపాయల విలువగల, మూడు వేల మందికి పైగా దివ్యాంగులు, వయో వృద్ధులకు ఉచితంగా సహాయ పరికరాలు వారికి అన్నం పెట్టి పంపిణీ చేశారు.భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడీఐపీ అసిస్టెన్స్ టూ డిసైబ్లెడ్ పర్సన్స్ ఫర్ పర్చాసే ఫిట్టింగ్ అఫ్ ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ పథకం కింద దివ్యాంగులకు సహాయక పరికరాల పంపిణీ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా కలెక్టర్ దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నారాయణస్వామి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎం డి ఫిరోజ్ ల, ఉమ్మడి కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాతిమా, ఆర్ డి ఓ చల్లా. విశ్వనాధ్, మున్సిపల్ కమిషనర్ బండి. శేషన్న, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి.

విశ్వనాధ్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి, వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్. రవికృష్ణ ల చేతుల మీదుగా దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, బ్యాటరీ సైకిళ్ళు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టిక్స్, తదితర సహాయక పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.వారు మాట్లాడుతూ నార ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ రెండేళ్లలో రాష్ట్రంలో మొట్టమొదటి సారి నంద్యాల జిల్లాకు ఒకేసారి 4 కోట్ల రూపాయల విలువగల, మూడు వేల మందికి పైగా దివ్యాంగులు, వయో వృద్ధులకు వారి అవసరాలకు అనుగుణంగా వీల్ చైర్లు, ట్రై సైకిళ్ళు, బ్యాటరీ సైకిళ్ళు, మూగ. చెవిటి వారికి వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టిక్స్ తదితర సహాయ పరికరాలు అందజేయడం తాను అదృష్టంగా భావిస్తున్నానన్నారు.దివ్యాంగులకు నెలకు రూ. 15 వేల పెన్షన్ అందిస్తూ, ఈ రెండేళ్ల పాలనలో రెండు సార్లు వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆర్ టి సి బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి వికలాంగుల పక్షపతిగా పాలన చేస్తున్నారని ఎంపీ వివరించారు. వైసీపీ గత పాలనలో జీ ఓ తెచ్చి దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ లేకుండా చేశారాని ఆమె విమర్శలు చేశారు.
వైసీపీ మెగా డి ఎస్సీ పై అవస్థవ ప్రచారం చేస్తోందని, మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని, వారిపై రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో మహిళలు ఫిర్యాదు చేయబోతున్నామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. జిల్లా కేంద్రంలో ఎంపీ నిధులతో, జిల్లా కలెక్టర్ సహకారంతో దివ్యాంగుల కమ్యూనిటీ నూతన హల్ నిర్మాణం చేస్తానని ఎంపీ శబరి హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తనకు వికలాంగులు ఫోన్ చేయాలనీ, మీ సమస్యకు తాను పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధసి కురువ ఎల్లాప్ప, నంద్యాల జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, డివిజన్ వికలాంగుల సంఘం అధ్యక్షులు ఎం పి వి రమణయ్య, నాయకులు డి పి మస్తాన్, తదితర వికలాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
