సెల్ఫీ వీడియోలో కనిపించిన టీడీపీ జోష్

  • కార్యకర్తల జోష్‌కు ఫిదా అయిన ఎంపీ చిన్ని!

భవానిపురం ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) కార్యకర్తలు, ప్రజలతో కలిసి ప్రత్యేకంగా సెల్ఫీ వీడియో తీశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడంతో ఎంపీ చిన్ని ఆనందం వ్యక్తం చేశారు. కార్యకర్తల జోష్‌, ప్రజల ఆదరణను తన సెల్ఫీ వీడియోలో బంధించిన ఆయన, ఇదే ఉత్సాహంతో ప్రతి ఇంటికీ పార్టీ సందేశాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యకర్తల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.