హనుమకొండలో మహిళ దారుణ హత్య..

హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4వ డివిజన్ కృష్ణ కాలనీలో శనివారం రాత్రి ఓ మహిళ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సమాచారం అందుకున్న వెంటనే కాకతీయ యూనివర్సిటీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు.

మృతురాలి వివరాలతో పాటు హత్యకు పాల్పడిన వ్యక్తులు ఎవరు అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలం నుంచి ఆధారాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.