RR| సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలి… ఎమ్మెల్యే యాదయ్య

వికారాబాద్, మార్చి 28 (ఆంధ్రప్రభ ) : సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం నవాబ్ పేట్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూ.11,64,000లు (పదకొండులక్షల అరవై నాలుగు వేలు) విలువ గల 30 సీఎంఆర్ఎఫ్ (చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్) చెక్కులను పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తుందన్నారు. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందని తెలిపారు. పేదలకు సీఎంఆర్ఎఫ్‌ పథకం వరం లాంటిదని, సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అర్హులైన పేదలు ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నవాబ్ పేట పీఏసీఎస్ చైర్మన్ రామ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply