చందాపూర్‌లో ఘనంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు జన్మదిన వేడుకలు
విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
తాడ్వాయి, ఆంధ్రప్రభ : ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు జన్మదిన వేడుకలను తాడ్వాయి మండలంలోని చందాపూర్ గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చందాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు, చాక్లెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ, మండల ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్, గ్రామ అధ్యక్షుడు మహిపాల్, గ్రామ కార్యదర్శి గజరాజు సందయ్య, సాకలి రాజయ్య, ఎండీ నాజీర్, బొల్లు నరేష్, ఆవుల బాలరాజు, రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
