రైలు ఢీకొని వ్యక్తి మృతి..

గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పులూరు రైల్వే స్టేషన్ గేట్ కి సమీపంలో సుమారు సాయంత్రం 6గంటల సమయంలో గుర్తు తెలియని 60 నుంచి 70 సంవత్సరాలు వయసు గల మగ వ్యక్తి రైలు పట్టాలు దాటుతూ రైలు బండిచే ఢీకొనబడి మరణించారు. అతని ఒంటిపై పచ్చ రంగు పూల లుంగి, లేత పసుపు రంగు షర్టు ఉంద‌ని, అతని ఆచూకీ తెలిసినవారు గుడివాడ రైల్వే పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించవలసినదిగా కోరారు. ఫోన్ నెంబర్లు 9247585713, 9989029379 ల‌కు తెలియపరచవలసిందిగా కోరారు.