అంబటి రాంబాబుపై కేసు నమోదు

  • మంగళగిరి సీఐడీ కార్యాలయంలో కేసు..
  • పెమ్మసానిపై ఏఐ వీడియోతో తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణ

గుంటూరు, ఆంధ్రప్రభ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో మంగళగిరి సీఐడీ కార్యాలయంలో కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారంపై పిల్లి మాణిక్యాలరావు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్దేశంతో ఏఐ వీడియోను ప్రచారం చేశారని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ కార్యాలయంలో కేసు నమోదు కాగా, ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.