తెలంగాణ భవన్‌లో పెద్దికి శ్రద్ధాంజలి

అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు నివాళులు

హనుమకొండ, ఆంధ్రప్రభ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అకాల మరణం పట్ల శుక్రవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్, ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి పెద్ది సుదర్శన్‌రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పులి రజనీకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన నాయకుడిగా, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ప్రజానాయకుడిగా ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగ్, బొంగు అశోక్ యాదవ్, సీనియర్ నాయకులు ఖాండే రావు నరసింహారావు, దువ్వ కనకరాజ్, వేణు, పున్నం చందర్, పులి విక్రమ్, నరేష్, రాబర్ట్, పుల్లయ్య, వినయ్, రాజ్, కుమార్, నయీమ్ జుబేర్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.