చేపల వేటకు వెళ్లి..

మత్స్యకారుడు మృతి.. పొనగల్లులో విషాదం

రేగొండ, ఆంధ్రప్రభ : చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన రేగొండ మండలం పొనగల్లు గ్రామంలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే అల్ల సుధాకర్ (40) వృత్తిరీత్యా దొమ్మటిపల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదపు వశాత్తు కాలుకు వల చిక్కుకొని శుక్రవారo మృతి చెందాడు.మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.