పెద్ది మృతి తెలంగాణకు తీరని లోటు
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు
ఆయన ఆశయాలతోనే బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేస్తాం
ఇల్లెందు, ఆంధ్రప్రభ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పేర్కొన్నారు. ఆయన మృతికి నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాంటి ఉద్యమ నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి భౌతికంగా దూరమైనప్పటికీ, ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగుతూ బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని హరిప్రియ నాయక్ తెలిపారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
