MEDARAM | వనదేవతలకు ఎస్పీ పూజలు

MEDARAM | వనదేవతలకు ఎస్పీ పూజలు
మేడారం ఆలయాన్ని దర్శించుకున్న సుధీర్ రామ్నాథ్ కేకన్
MEDARAM | తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి (Tadwai, Mulugu District) మండలం మేడారం సమ్మక్క సారాలమ్మ వనదేవతలను (Medaram Sammakka Saralamma, the goddess of the virgins) నూతన ములుగు జిల్లా ఎస్పీసుధీర్ రామ్నాథ్ కేకన్ దర్శించుకున్నారు. ముందుగా పూజారుల సంప్రదాయంగా డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తల్లులకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, బెల్లం, కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు (Special Pujas) నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాదాయశాఖ అధికారులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఓఎస్డి శివం ఉపాధ్యాయ, డిఎస్పి రవీందర్, పస్రా సీఐ దయాకర్, శంకర్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ మధుకర్, పూజారులు జగ్గారావు, సారయ్య, కొక్కెర రమేష్, పోలీస్ సిబ్బంది రమేష్, పూజారి రమేష్, వెంకటేశ్వర్లు, రజినీకర్, దేవాదాయ శాఖ జగదీశ్, మధు, వీరన్న పాల్గొన్నారు.
