పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తీరని లోటు: ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ, ఆంధ్రప్రభ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, ప్రజాసేవ పట్ల చూపిన అంకితభావం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ప్రజలతో మమేకమై నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఎమ్మెల్యే అన్నారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని పేర్కొంటూ, దివంగత నేత ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
