మున్సిపల్ కార్మికులకు రేయిన్ జాకెట్ల పంపిణీ

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: వర్షాకాలంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల భద్రత దృష్ట్యా వారికి రేయిన్ జాకెట్లను శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి పంపిణీ చేశారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీల శుభ్రపరిచే పనులు, చెత్త సేకరణ వంటి సేవలను వర్షంలోనూ నిరంతరం అందిస్తున్న కార్మికులకు ఈ జాకెట్లు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ కార్మికులు అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడిన ఆమె, వారి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ జాకెట్లను అందజేసినట్లు పేర్కొన్నారు.

కార్మికుల సంక్షేమానికి పాలకవర్గం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అవసరమైన రక్షణ సామగ్రిని దశలవారీగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ తెలిపారు. వర్షాల కారణంగా పట్టణంలో ఎక్కడైనా నీటి నిల్వలు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సంటి లత, కౌన్సిలర్లు పర్శ కుశలత, సంగ్యా నాయక్, సందీప్, అంజుమ్, సతీష్, నాయకులు పర్శ అనంతరావు, జేజే నర్సయ్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.