పీఏసీఎస్ నూతన చైర్మన్ ఉపేందర్ రెడ్డికి ఘన సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పీఏసీఎస్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జనగాం ఉపేందర్ రెడ్డిని మార్కెట్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

మార్కెట్ కమిటీలో పీఏసీఎస్ తరఫున పాలకవర్గ సభ్యునిగా ఉపేందర్ రెడ్డి కొనసాగనున్న నేపథ్యంలో మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, డైరెక్టర్లు, మార్కెట్ కార్యదర్శి, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.