మంత్రి వివేక్ వెంకటస్వామి
వరద ప్రాంతాల పర్యవేక్షణ
చెన్నూర్ ఆంధ్రప్రభ : గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగిపోతున్న వరద ప్రాంతాలను గురువారం సాయంత్రం మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా వెళ్ళి పర్యవేక్షించారు. తొలుత ఉప్పొంగి ప్రవహిస్తున్న మండలంలోని అక్కపెల్లి వాగును, మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు ( ఓడ్డపల్లి) ప్రాంతాన్ని మంత్రి పర్యవేక్షించిన మంత్రి మాట్లాడుతూ వాతావరణ కేంద్ర సూచన ప్రకారం రెండు రోజులుగా వర్షలు కురుస్తున్నయని మరో రెండు రోజులు వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే పట్టణంలోని 7వ వార్డు లోని క్యాజ్ వె బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరి అయ్యాయని కేవలం డిజిన్ చేయడంలో జాప్యం జరిగిందని త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. అనంతరం ప్రారంభనికి సిద్దమైన 100 పడకల ఆసుపత్రి నిర్మాణా పనులను మంత్రి సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
