చంద్రబాబును కలిసిన మన్నే కళావతి..

సీఎంకు అమ్మవారి ప్రసాదం అందజేత..

( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలకమండలి సభ్యురాలు మన్నే కళావతి గురువారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కి అందజేసి అమ్మవారి ఆశీస్సులను తెలియజేశారు. అనంతరం ముఖ్యమంత్రితో ఆత్మీయంగా భేటీ అయిన మన్నే కళావతి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కళావతి సీఎం చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు.