Nandyal Bureau | జిల్లాలో గంజాయి కలకలం

Nandyal Bureau | జిల్లాలో గంజాయి కలకలం

  • గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల దాడి
  • 6 కిలోల గంజాయి స్వాధీనం

Nandyal Bureau | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో రోజు రోజుకు గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని సిరివెళ్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు శనివారం దాడి చేశారు. వారి నుంచి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదు మంది ని అరెస్ట్ చేశారు.ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ తెలిపిన వివరాలమేరకు జిల్లాఎస్ పి సునీల్ షెరాన్, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడ గంజాయి, అమ్మేవారు కొనేవారు అసాంఘిక శక్తులు రౌడీ మూకలు పై జిల్లావ్యాప్తంగా డేగ కన్నులు పెట్టమని ఆదేశించారు.

ఈ మేరకు శిరివెళ్ల సర్కిల్ సీఐ రాము ఆద్వర్యంలో, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడిందన్నారు.ఈ క్రమంలో, శిరివెళ్ల పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ జయప్ప కు అందిన ముందస్తు సమాచారం ప్రకారం ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.శిరివెళ్ల మండలం బోయిలకుంట్ల గ్రామానికి చెందిన జింకల మద్దిలేటి ఏ 1వద్దకు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాసు ఏ 2 గంజాయి తీసుకొని బోయిలకుంట్ల గ్రామ సమీపంలో ఉన్న కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు వస్తాడని తెలిసింది. శిరివెళ్ల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ సిబ్బంది కలిసి బోయిలకుంట్ల గ్రామ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు వెళ్లారు. అక్కడ ఐదుగురు వ్యక్తులు గంజాయిని ప్యాక్ చేసి అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా మాట్లాడుకుంటూ ఉండగా, వారిని పట్టుకొని తనిఖీ చేశారు.

జింకల మద్దిలేటి ఏ1 వద్ద నుండి 2 కిలోల గంజాయిని,కోడూరు శ్రీనివాసు ఏ 2 వద్ద నుండి 1 కిలో గంజాయిని, దండబోయిన గురుస్వామి ఏ 3 వద్ద నుండి 1 కిలో గంజాయిని,షేక్ అబ్దుల్ నబీ ఏ 4 వద్ద నుండి 1 కిలో గంజాయి ని,మొఘల్ గఫార్ భేగ్ ఏ 5 వద్ద నుండి 1 కిలో గంజాయి మొత్తం కలిపి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేశామని తెలిపారు.విచారణలో ఏ 1 జింకల మద్దిలేటి పై ఇప్పటికే కృష్ణా జిల్లా అవనిగడ్డ పి.ఎస్., ఢిల్లీ, నంద్యాల జిల్లా మహానంది పి.ఎస్., నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ లో కలిపి మొత్తం 4 గంజాయి కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు.

ఇతనిపై రోడీ షీట్ మరియు సస్పెక్ట్ షీట్ కూడా ఉందన్నారు. గతంలో ఇతడు ఒరిస్సా నుండి గంజాయి తెచ్చేవాడన్నారు. ఆ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాసు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం అదే పరిచయంతో, కోడూరు శ్రీనివాసు ద్వారా ఒరిస్సా నుండి గంజాయి సరఫరా చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా కు పాల్పడిన వారిపై , రౌడీ షీటర్లు మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply