రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి

జైనూర్‌లో మన గ్రోమోర్ కేంద్రం ప్రారంభం

జైనూర్, ఆంధ్రప్రభ: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు మెరుగైన వ్యవసాయ సేవలు అందించాలని జైనూర్ సీఐ రమేష్, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ అన్నారు.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని గురువారం ఏరియా మేనేజర్ భానుప్రకాశ్, జిల్లా వ్యవసాయ అధికారి బి. వెంకట్‌తో కలిసి వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏరియా మేనేజర్ భానుప్రకాశ్ మాట్లాడుతూ రైతులకు చేరువగా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో మన గ్రోమోర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కేంద్రం ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, సాంకేతిక సలహాలతో పాటు వ్యవసాయానికి అవసరమైన సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పంట దిగుబడులు పెంచుకునేందుకు రైతులకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

వ్యవసాయ రంగానికి సాంకేతిక సహకారం, నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో మన గ్రోమోర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జైనూర్ సర్పంచ్ కొడప ప్రకాష్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్, సీఐ రమేష్, పవర్‌గూడ సర్పంచ్ తొడసం రాజేందర్, బీఆర్ఎస్ జైనూర్ మండల అధ్యక్షుడు ఇంతియాజుల్లా, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఏరియా మేనేజర్ భానుప్రకాశ్, మార్కెటింగ్ మేనేజర్ దేవరాజ్, కనక శ్రీనివాస్ (ఎఫ్ఏఎస్), సందీప్, సంతోష్, రైతులు పాల్గొన్నారు.