ధ్యానంతో మానసిక ప్రశాంతత..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రతినిత్యం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండవచ్చని ఊట్కూర్ మాజీ జెడ్పిటిసి సి. సూర్యప్రకాశ్ రెడ్డి, హార్ట్ ఫుల్ నెస్ జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్అన్నారు.
ఆదివారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో హార్ట్ ఫుల్ లెన్స్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేడు ప్రతి మనిషి వివిధ పనులు ఒక కుటుంబ సమస్యలతో సతమతమవుతూ అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసిందని ధ్యానం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలుఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం ధ్యానం అలవర్చుకోవాలని ధ్యానం చేయాలని లక్ష్యంతో కేంద్రాన్ని ఏర్పాటుచేశారనిఅన్నారు.
ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలనిఅన్నారు. ప్రతి ఒక్కరూ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు గ్రూపు మెడిటేషన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా తాపస్ నాయకులునర్సింగప్ప,సెంటర్ కోఆర్డినేటర్ నారాయణ రెడ్డి,అభ్యాసులు బసిరెడ్డి, భాను చందర్ భగత్ సురేందర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
