Lenin | అఖిల్‌ కెరీర్‌లోనే తొలి భారీ మైలురాయి

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అఖిల్ కెరీయర్‌ లోనే తొలి మైలురాయిని అధిగమించింది లెనిన్‌ చిత్రం. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఈ సినిమా తాజాగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

సినిమా విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కొనసాగడంతో మరో రూ.12 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి మొత్తం వసూళ్లు రూ.100 కోట్ల మార్క్‌ను దాటినట్లు నిర్మాతలు వెల్లడించారు.

అఖిల్ సినీ ప్రయాణంలో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కావడం విశేషం. అంతే కాకుండా, ఆయన కెరీర్‌లో మొట్టమొదటి రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా ‘లెనిన్’ రికార్డు సృష్టించింది.

యాక్షన్, భావోద్వేగాలు, కమర్షియల్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా అఖిల్ నటన, కథనం, సాంకేతిక విలువలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కాగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పంచుకుంటున్నారు.