భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
వేములవాడ, ఆంధ్రప్రభ: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేలకు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు.
