వెనుక నుంచి వాహనం ఢీకొట్టిందా?.. కారు ప్రమాదంలో..
బెజ్జంకి, ఆంధ్రప్రభ: మండలంలోని రేగులపల్లి గ్రామానికి చెందిన జెల్ల శేఖర్ (27) కారు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం ఉదయం ఆయన కారులో కరీంనగర్‌కు బయలుదేరగా, మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం కారును ఢీకొట్టడంతో కారు అదుపు తప్పి రోడ్డుపక్కనున్న స్థంభాన్ని ఢీకొట్టినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో శేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు శేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో రేగులపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
