ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలి: డీఎంహెచ్‌వో

మరిపెడలో బాలుడి మృతి ఘటనతో ప్రజత్ క్లినిక్ సీజ్..

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

మరిపెడ, ఆంధ్రప్రభ: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఇటీవల వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ప్రజత్ క్లినిక్‌ను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రవి రాథోడ్ తెలిపారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు (ఆర్ఎంపీలు) ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని సూచించారు. క్లినిక్‌లలో బెడ్లు ఏర్పాటు చేసి ఇంజెక్షన్లు ఇస్తూ నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

ఈ ఏడాదిలో ఇదే క్లినిక్‌లో ఇద్దరు మృతి చెందిన ఘటనలపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హతకు మించి వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మనోహర్ కృష్ణ పాల్గొన్నారు.