భారీ వర్షానికి కూలిన వృక్షం

విద్యుత్ తీగలపై చెట్టు పడడంతో అంతరాయం.. వేగంగా పునరుద్ధరించిన అధికారులు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు పద్మశాలి భవన్ సమీపంలో విద్యుత్ తీగలపై భారీ వృక్షం కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి, రహదారిపై అడ్డంగా పడిన భారీ వృక్షం, కొమ్మలను యంత్రాల సహాయంతో తొలగించారు.

అనంతరం విద్యుత్ శాఖ సిబ్బంది దెబ్బతిన్న విద్యుత్ తీగలను మరమ్మతు చేసి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అధికారుల సత్వర స్పందనతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.