అంతర్జాతీయ పులుల దినోత్సవం… రేంజర్‌కు ప్రశంస
మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా సత్కారం
జన్నారం, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన అటవీశాఖ అధికారిని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్‌కు చెందిన ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గోదారి లక్ష్మీనారాయణకు మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, నగదు రివార్డు అందజేశారు.
హైదరాబాద్‌లోని దూలపల్లి తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ప్రశంసాపత్రం, నగదు రివార్డు ప్రదానం చేసి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన అటవీశాఖ అధికారి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశంసాపత్రం అందుకున్న గోదారి లక్ష్మీనారాయణను స్థానిక అటవీ డివిజనల్ అధికారి రామ్మోహన్, జన్నారం, తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ అధికారులు బాబా ఖాదర్ వలీ, జి. వికాస్‌తో పాటు పలువురు అటవీ అధికారులు, మిత్రులు అభినందించారు.
