శివ దత్త సాయి ఆలయంలో ముస్తాబైన సాయినాధుడు
ఘనంగా గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు
ఎల్కతుర్తి ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని శివాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ శివదత్త సాయి ఆలయంలో బుధవారం రోజున గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో సాయి నాధుడిని దర్శించుకున్నారు. కాకడ హారతి, అనంతరం అర్చన, అభిషేకం, ధూప, దీప, నైవేద్య సమర్పణ ప్రత్యేక పల్లకి సేవలో అశేష జనవాని భక్తులు పాల్గొని ఆ సాయినాధుడిని స్మరించుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. శ్రీ గురుదత్త స్వామి, శివదత్త సాయిబాబా భక్తుల కోరికలను నెరవేర్చే కరుణామూర్తిగా ప్రసిద్ధి చెందారని, గురు పౌర్ణమి రోజున స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటే ఆధ్యాత్మిక శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సకల శుభాలు కలుగుతాయని అర్చకులు నందనం రవి తెలిపారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం, అన్నప్రసాదం స్వీకరించి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ అర్చకులు నందనం రవి, మణికంఠ, రాహుల్ శర్మ భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ సేటు, నరసింహ స్వామి, జైపాల్ రెడ్డి,సి ఏ కవిత, అంగన్వాడి టీచర్లు ఉమా, విజయ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
