కేసీఆర్ పార్క్‌ను వెంటనే తెరవాలి: బీఆర్ఎస్ డిమాండ్

పార్క్ మూసివేతతో ప్రజలు, వాకర్స్‌కు ఇబ్బందులు

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కేసీఆర్ పార్క్‌ను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.

నిరసన అనంతరం కేసీఆర్ పార్క్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

పార్క్ మూసివేత వల్ల స్థానిక ప్రజలు, ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వచ్చే వాకర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

పార్కులో తక్షణమే నిర్వహణ పనులు చేపట్టి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.