Asian U23 Athletics | ఆసియా అండర్-23 స్వర్ణ విజేతతో సీఎం భేటీ
Asian U23 Athletics | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే విభాగంలో స్వర్ణ పతకం సాధించిన సాయి ప్రవల్లికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్‌లోని MCRHRDలో సీఎం రేవంత్ రెడ్డిని TGSWREIS (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం) విద్యార్థిని సాయి ప్రవల్లిక మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన అంతర్జాతీయ స్థాయి విజయంపై సీఎం ప్రశంసలు తెలిపారు. క్రీడా రంగంలో తెలంగాణకు పేరు తీసుకొచ్చిన ప్రవల్లికను అభినందించిన సీఎం, ఆమె భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
