సుధా ప్రవీణ్ కు జనసేన నేతల సత్కారం..
కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తూ గత కొద్దిరోజుల కిందట డిడిఎల్ఓ గా పదోన్నతి పొంది తిరువూరు డిడిఎల్ఓ గా బదిలీపై వెళుతున్న సుధా ప్రవీణ్ ను కోడూరు మండల జనసేన పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.
స్థానిక కార్యాలయంలో సుధా ప్రవీణ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా కప్పి ఘనంగా సత్కరించి, స్వీట్స్ అందించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మరె గంగయ్య మాట్లాడుతూ… కోడూరు మండలంలో గత ఆరు సంవత్సరాలుగా సేవలందిస్తూ ప్రజల మన్ననలను పొందారని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లడంలో సుధా ప్రవీణ్ కృషి చేశారన్నారు. వృత్తి పట్ల నిబద్ధత పనిచేస్తూ సోమిరెడ్డిగా పేరు సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, కోడూరు పట్టణ అధ్యక్షులు కోట రాంబాబు, వర్రే రాంబాబు, కాగిత రామారావు, అప్పి కట్ల వినోద్, తదితరులు పాల్గొన్నారు.
