Article |ఆంధ్రప్రభ కథనంలో.. అధికారుల్లో చలనం

రహదారి మరమ్మతులకు అధికారులు స్పందన
Article | అచ్చంపేట, (ఆంధ్రప్రభ) : అచ్చంపేట మండలం, రంగాపురం నుండి శ్రీశైలం వెళ్లే రహదారి ప్రమాద భరితంగా మారిపోయిందని ఆంధ్రప్రభ నవంబర్ 19న వెల్లడించిన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. గత నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల ప్రభావంతో రహదారి పెద్దఎత్తున కొట్టుకుపోయి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఈ వార్త ప్రచురితమైన వెంటనే, పోలీసు శాఖ ఆధ్వర్యంలో SI సద్దాం హుస్సేన్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆయన సంబంధిత అధికారులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి… మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు.

