స్థానిక ప్రజలకు శాపంగా మారిన నేషనల్ హైవే..
వాంకిడి, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలోని బంబారా గ్రామ పంచాయతీ పరిధిలో నేషనల్ హైవే ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థిని,విద్యార్థులకు స్థానిక ప్రజలకు రాకపోకలు ఒక వైపు నుండి మరో వైపుకి దాటడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే అధికారులు స్పందించి ఫుట్ వేర్, బస్టాండ్, సెంట్రల్ లైట్స్ ఏర్పాటు చెయ్యాలని కోరుతూ. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల నాయబ్ తహసిల్దార్ రామ్ లాల్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.!
ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొయిరే ప్రకాష్ మాట్లాడుతూ
రాబోయే రోజుల్లో బంబారా గ్రామపంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశలవారీ ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నట్లు వినతి పత్రంలోతెలిపారు.
పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప..
సమస్య చిన్నదైనా పెద్దదైనా పోరాటమే మార్గం.అనే స్ఫూర్తితో ఈ నిరసనలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ రహదారిపై నిత్యం ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ఇక్కడ అండర్ పాస్ వంతెన,బస్ షెల్టర్,మరియు రహదారి మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధనకై సిపిఐ చేపట్టే దశలవారీ ఆందోళన కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని,ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కొదురుపాక మహేష్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు పిప్పిరి వెంకటేష్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాకేష్ లు ఉన్నారు.
