క్రీడా ప్రాంగణంలో కనీస వసతులు కల్పించాలి…

బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో గల తెలంగాణ క్రీడా ప్రాంగణంలో కనీస వసతులు కల్పించాలని టిజీవిపి మండల అధ్యక్షులు భరత్ రాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రామ సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడా ప్రాంగణంలో గడ్డి పెరగడం వల్ల క్రీడాకారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. రాత్రివేళలో లైట్లు లేకపోవడంతో క్రీడలు ఆడలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన చెప్పారు. క్రీడా ప్రాంగణాన్ని తక్షణమే శుభ్రం చేయించి లైట్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. క్రీడాకారులు ఆడుకోవడానికి వాలీబాల్ నెట్ ఏర్పాటు చేయాలని ఆయా తెలిపారు. కార్యక్రమంలో టీజీవిపి ప్రతినిధులు విజయ్, రోహన్, మనోజ్, సన్నీ, ధనుష్, ప్రణయ్, యోగి, ఓంకార్, అఖిల్ ఉన్నారు.