Bheemgal  జాతీయ కుటుంబ ప్రయోజన పథకం చెక్కులు పంపిణీ

Bheemgal  జాతీయ కుటుంబ ప్రయోజన పథకం చెక్కులు పంపిణీ

భీమ్‌గల్ రూరల్ Bheemgal , ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) చెక్కులను పంపిణీ చేశారు. పోషించే పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, గ్రామ సర్పంచ్ దుమాల మమత (రాజు) చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా చేంగల్ గ్రామానికి చెందిన నలుగురు మహిళలకు రూ.20 వేల చొప్పున మంజూరు అయినట్లు తెలిపారు.

18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన కుటుంబ యజమాని మరణించిన మహిళలు ఈ పథకానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకం పెద్ద చేయూత ఇస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్, గ్రామ శాఖ అధ్యక్షుడు దుమాల రాజు, పల్లికొండ సర్పంచ్ పిండి మనూష (అశోక్), ఎంపీడీవో కంప్యూటర్ టైపిస్ట్ చంద్రశేఖర్, ఆపరేటర్ సంతోష్, పంచాయతీ కార్యదర్శి వినయ్ తదితరులు పాల్గొన్నారు.