మోతె పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ..
మోతె, ఆంధ్రప్రభ : వార్షిక తనిఖీలో భాగంగా గురువారం కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి మోతె పోలీస్ స్టేషన్ను సందర్శించారు.ఈ సందర్భంగా డిఎస్పి కి సిఐ డి. రామకృష్ణ రెడ్డి,మోతె ఎస్సై బి. లచ్చిరెడ్డి పూల మొక్కలతో స్వాగతం పలికారు.అనంతరం డిఎస్పి సిబ్బందితో పరేడ్ నిర్వహించి, వారి వ్యక్తిగత కిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి విధి నిర్వహణలో తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.తదుపరి స్టేషన్లోని కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు మరియు స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, కేసుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని ఆదేశించారు.
