వర్తక సంఘం రద్దు చేయడం అంటే ఒకరి పొట్ట కొట్టడమే..
వర్తక సంఘం రద్దు చేయడం అంటే ఒకరి పొట్ట కొట్టడమే..
ఉన్న దుకాణాలను కొనసాగిస్తూనే
నిరుద్యోగులకు మరిన్ని దుకాణాలు వచ్చేలా కృషి చేద్దాం…
బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి
యాదగిరిగుట్ట ,ఆంధ్రప్రభ : దేవస్థానం కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయడం అంటే ఉపాధి పొందుతున్న పేదల మధ్య తరగతి వారి పొట్ట కొట్టడమేనని అలా కాకుండా ఉన్న దుకాణాలను కొనసాగిస్తూనే స్థానిక నిరుద్యోగ యువతకు అదనంగా దుకాణాలు వచ్చేలా దేవస్థానం వారితో ప్రభుత్వంతో పోరాడుదాం అని బి ఆర్ ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కర్రి వెంకటయ్య పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరీలు అన్నారు. శనివారం వారు యాదగిరిగుట్ట బిఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని కొంతమంది నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారని వర్తక సంఘాన్ని రద్దు చేయాలి అని కాకుండా ఉన్న దుకాణాలను కొనసాగిస్తూనే తమకు కూడా దుకాణాలను కేటాయించాలని వారు కోరాలని అన్నారు.
అలా అయితే తమ మద్దతు కూడా ఉంటుందని అన్నారు 114 దుకాణాలకు గాను ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 500 మంది ఉపాధి పొందుతున్నారని ఉన్నపలంగా వర్తక సంఘాన్ని రద్దుచేసి దుకాణాలను రద్దు చేయడం అంటే వారందరినీ రోడ్డున పడేయడమేనని అన్నారు ఇది సరైన కాదని అన్నారు. నిరుద్యోగులకు యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగ దుకాణాల ద్వారా వారికి ఉపాధి కల్పించేందుకు అందరం కృషి చేద్దామని అన్నారు. ఇప్పటికైనా దుకాణాలను వర్తక సంఘాన్ని రద్దు చేయాలని వారి ఆందోళనను విరమించుకోవాలని కోరుతున్నామని అన్నారు ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ నాయకులు ఆరే శ్రీధర్ గౌడ్ , కాంటే కార్ పవన్ కుమార్, ముక్కెర్ల సతీష్ యాదవ్, అంకం నరసింహ తదితరులు పాల్గొన్నారు.
