వెలిగొండ గ్రామ సచివాలయానికి తాళాలు
- అందుబాటులో లేని సిబ్బంది
- పట్టించుకోని అధికారులు
- అధికారుల పర్యవేక్షణ కరువు..!
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. గ్రామ సచివాలయాలలో పనిచేసే సిబ్బంది, ప్రజలకు అందు బాటులో ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సచివాలయాలలో పనిచేసే సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో, గ్రామ సచివాలయాలకు నిరంతరం తాళాలు వేసి ఉంటారని బహిరంగ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలని, ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయంలో పని చేసే సిబ్బంది వాటిని అమలు చేయకుండా, ఆదేశాలను తూట్లు పొడుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని వెలిగొండ గ్రామ సచివాలయానికి నిరంతరం తాళాలు వేసి ఉంటారని ప్రజలు విమర్శిస్తున్నారు. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ కరువు కావడంతో, దానికి ఆసరాగా తీసు కొని గ్రామ సచివాలయంలో పనిచేసే సిబ్బంది తమకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పోతూ ఉంటారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ సచివాలయానికి తాళాలు తీయకపోవడంతో ప్రజలకు మెరుగైన సేవలు సక్రమంగా అందడం లేదని, దీనితో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.
గ్రామ సచివాలయ సిబ్బంది..
కోసం ప్రతిరోజు గ్రామ సచివాలయం వద్ద పడిగాపులు కాస్తున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని గ్రామ సచివాలయానికి, తెరిచి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డిప్యూటీ ఎంపీడీవో సతీష్ కుమార్ వివరణ..
వెలిగొండ గ్రామ సచివాల యాన్ని తెరిచి, ప్రజలకు మెరుగైన సేవలు అందించ డానికి చర్యలు తీసుకుంటా మని డిప్యూటీ ఎంపీడీవో సతీష్ కుమార్ తెలిపారు.
