Sri Sathya sai | ఘనంగా క్రిస్మస్ వేడుకలు..

Sri Sathya sai | ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
Sri Sathya sai Bureau, ఆంధ్రప్రభ : క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రేమ, క్షమ, త్యాగాలకు ప్రతీక అయిన ఏసుక్రీస్తు సందేశాలను స్మరించుకుంటూ క్రైస్తవులు ఆనందోత్సాహాలతో ఈ పర్వదినాన్ని జరుపుకున్నారు.
జిల్లాలోని ప్రధాన పట్టణాలైన హిందూపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిరతో పాటు మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల పరిధిలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే చర్చిలకు చేరుకున్న క్రైస్తవ సోదరులు ఏసుక్రీస్తు జన్మోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు, బైబిల్ పఠనాలతో చర్చిలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.
