తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు కాకి రంగరాజుకు సన్మానం

కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన సత్కారం

వికారాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు, వికారాబాద్‌కు చెందిన కాకి రంగరాజును ఆదివారం సాయంత్రం వికారాబాద్ మున్సిపాలిటీ 31వ వార్డు కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా దుర్గం మల్లికార్జున్ గౌడ్, ఆయన కుటుంబ సభ్యులు కాకి రంగరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సన్మానానికి స్పందించిన కాకి రంగరాజు మాట్లాడుతూ, తనపై అభిమానంతో ఘనంగా సత్కరించిన దుర్గం మల్లికార్జున్ గౌడ్, ఆయన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దుర్గం మల్లికార్జున్ గౌడ్ సతీమణి సబితా గౌడ్, వారి కుమారుడు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.