Municipal Elections | బీఆర్ఎస్ విజయం ఖాయం..

Municipal Elections | బీఆర్ఎస్ విజయం ఖాయం..

Municipal Elections, వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించనున్నారు. గత రెండు సార్లు నాగేందర్ గౌడ్ కుటుంబానికి చెందిన కొడుకు విజయేందర్ గౌడ్, కోడలు అనంతలక్ష్మి విజేందర్ గౌడ్, విజయం సాధించగా ఈసారి పోటీలో నిలిచినారు. సోమవారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారానికి ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు.

ఈ సందర్భంగా మాజీ టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ నాగేంద్ర మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో ఈ వార్డ్ నుండి మూడోసారి గెలుపొందించడం ఖాయమని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అభివృద్ధికి పట్టంకటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విజయేందర్ గౌడ్, రాజేందర్ గౌడ్, ఎల్ సి రెడ్డి, దయానంద్, మారుతి, దశరథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.