Narsingi | రైతుల ధర్నా

Narsingi | రైతుల ధర్నా

  • శ్రీకర వెంచర్ పంట పొలాలకు దారి ఇవ్వాలంటూ..

Narsingi | నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో పంట పొలాలకు దారి కల్పించాలని కోరుతూ రైతులు ధర్నాకు దిగారు. గతంలో కొంతమంది రైతులు భూములను శ్రీకర వెంచర్ కు విక్రయించగా, వెంచర్ యజమానులు ఫెన్సింగ్ వేసి దారి మూసివేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోయారు.

నారు వేసి నెల రోజులు గడిచినప్పటికీ పొలాలకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న త‌హ‌సీల్దార్ గ్రేసీ బాయ్, ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. త‌హ‌సీల్దార్ గ్రేసీ బాయ్ శ్రీకర వెంచర్ యజమానితో మాట్లాడి సమస్యను సద్దుమణిగించారు. ఈ కార్యక్రమంలో రైతులు జనగామ సిద్ధరామ గౌడ్, జనగామ శ్రీనివాస్ గౌడ్, చింతల రాజమల్లు, చింతల స్వామి, సతీష్, బాబు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply