యూనివర్సల్ విద్యార్థినికి ప్రపంచ రికార్డు..

పాలకుర్తి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జీడీ నగర్ యూనివర్సల్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని డి. మహాలక్ష్మి ప్రపంచ రికార్డు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. 2026 మార్చి 20న నిర్వహించిన రికార్డు ప్రయత్నంలో 13 సంవత్సరాల వయస్సులో ఆమె కేవలం 1 నిమిషం 48 సెకన్లలో 50 భౌతిక పరిమాణాల యూనిట్లను అత్యంత వేగంగా వ్రాసి ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మహమూద్ ఇస్మాయిల్, ప్రధానోపాధ్యాయులు సయ్యద్ అఫ్జల్, ఉపాధ్యాయులు మహాలక్ష్మిని అభినందించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.