ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆర్‌డీఓ

ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఆర్‌డీఓ రాథోడ్ మోహన్‌సింగ్, తహసీల్దార్ ఎం. ప్రవీణ్ గురువారం పరిశీలించారు.

ముత్నూర్ గ్రామంలో బీఎల్‌ఓలు మేశ్రం సుమిత్ర, కేశవ్, అస్పత్‌రావుతో కలిసి నమోదు ప్రక్రియను సమీక్షించారు.

ఈ సందర్భంగా అధికారులు బీఎల్‌ఓలకు పలు సూచనలు చేశారు. ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే డూప్లికేట్ ఓట్లు, మృతి చెందిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను గుర్తించి జాబితాలను నవీకరించాలని సూచించారు.

ప్రతిరోజూ కనీసం 100 నుంచి 200 వరకు దరఖాస్తులు స్వీకరించి, ఎలాంటి పెండింగ్ లేకుండా ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి అర్హుడి నుంచి దరఖాస్తులు స్వీకరించి లక్ష్యాలను సాధించాలని బీఎల్‌ఓలకు సూచించారు.