సీపీఐ జిల్లా కార్యదర్శిగా అడ్డాడ
చల్లపల్లి – ఆంధ్రప్రభ : సీపీఐ కృష్ణాజిల్లా కార్యదర్శిగా అడ్డాడ ప్రసాద్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చల్లపల్లి లోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో జరిగిన సీపీఐ కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యదర్శిని ఎన్నుకున్నారు.
ఇప్పటివరకు జిల్లా కార్యదర్శి గా పని చేసిన నార్ల వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గంలోకి వెళ్ళగా సహాయ కార్యదర్శిగా ఉన్న ప్రసాద్ బాబు ను జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
